
యంగ్ హీరోస్ సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. నిన్ననే సందీప్ కిషన్ నటించిన ‘జోరు’ సినిమా ఆడియో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాని నవంబర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది చివరి దశలో ఉండగానే మరో సినిమాకి సందీప్ కిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
సందీప్ కిషన్ హీరోగా నటించనున్న కొత్త సినిమాకి వి. ఆనంద్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హీరోయిన్ గా ‘రన్ రాజా రన్’ ఫేం సీరత్ కపూర్ ని హీరోయిన్ గా సెలక్ట్ చేసారు. నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా పూర్తి వివరాలను అధికారికంగా త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా చాలా రోజుల క్రితమే పూర్తైన ‘డికే బోస్’ కూడా రిలీజ్ కావాల్సి ఉంది.

