
విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన భారి బడ్జెట్ సినిమా ‘ఐ’. విక్రమ్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు, డబ్బింగ్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి. విక్రమ్ ముంబైలో హిందీ వెర్షన్ కోసం డబ్బింగ్ చెప్తున్నారు. మరికొన్ని రోజులలో పూర్తవుతుందని సమాచారం. ఇప్పటికే తెలుగు, తమిళ వెర్షన్ల డబ్బింగ్ వర్క్స్ ను విక్రమ్ కంప్లీట్ చేశారు.
సెప్టెంబర్ 25న షూటింగ్ పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు ఇతర భాషలలో కూడా ఒకేసారి సినిమాను విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు. అందువల్ల, దీపావళికి విడుదల కావడం అనుమానమే అని యూనిట్ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.
180 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈ సినిమాకు స్వర మాంత్రికుడు ఏఅర్ రెహమాన్ సంగీతం అందించారు. తెలుగు, హిందీ ఆడియో ఇంకా విడుదల చేయలేదు. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

