రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్-2’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలైన కేవలం 15 రోజుల్లోనే రూ. 1501 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సీక్వెల్, మొదటి భాగం వచ్చిన మూడు నెలలకే విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా సక్సెస్‌తో నటుడు బిమల్ ఒబెరాయ్‌కు టాలీవుడ్‌లో భారీ అవకాశం దక్కింది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. టొవినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో బిమల్‌కు ఈ ఛాన్స్ లభించినట్లు సమాచారం.
‘దురంధర్-2’లో శ్రీరాని బలోచ్‌గా తన ఇంటెన్స్ నటనతో మెప్పించిన బిమల్, ఇప్పుడు నేరుగా ఎన్టీఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ చిత్రంలో బిమల్ పాత్ర ఎలా ఉండబోతుందో అని ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


