భాషా సీక్వెల్ కి కన్విన్స్ కాని రజినీకాంత్

భాషా సీక్వెల్ కి కన్విన్స్ కాని రజినీకాంత్

Published on Oct 13, 2014 10:03 AM IST

rajinikath (1)
సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పిన ఎన్నో సూపర్బ్ డైలాగ్స్ లో ‘నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు’ అనే డైలాగ్ ఒక బెంచ్ మార్క్ గా నిలిచిపోయింది. ఈ డైలాగ్ రజినీ నటించిన ‘బాషా’ సినిమాలోనిది. ఈ సినిమా రజినీకాంత్ ఎక్కడలేని స్టార్డం ని తెచ్చి పెట్టడమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా తనకి క్రేజ్ తెచ్చి పెట్టిన సినిమా. బాషా సినిమాతో రజినీకి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడలేని క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది.

ప్రస్తుతం బాషా డైరెక్టర్ సురేష్ కృష్ణ సూపర్ స్టార్ రజినీతో ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ రజినీ మాత్రం ఈ సినిమా విషయమ్లో తొందరపడి నిర్ణయం తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే అలాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కి సీక్వెల్ అంటే సింపుల్ స్క్రిప్ట్ తో టచ్ చెయ్యకూడదని, అలాగే అంత సింపుల్ గా కూడా ఉండకూడదని ఆయన భావిస్తున్నారు. సురేష్ కృష్ణ చెప్పిన లైన్స్ కి రజినీ పెద్దగా కన్విన్స్ అవ్వలేదు. కావున ఈ ప్రాజెక్ట్ ఉండదనే అనుకోవాలి. ఒకవేళ సురేష్ కృష్ణ ఏమన్నా మరో పర్ఫెక్ట్ లైన్ తో వచ్చి రజినీని ఇంప్రెస్ చేస్తాడేమో చూడాలి.

తాజా వార్తలు