రజినీకాంత్ ‘లింగ’ లో త్రిష స్పెషల్ సాంగ్.?

రజినీకాంత్ ‘లింగ’ లో త్రిష స్పెషల్ సాంగ్.?

Published on Oct 15, 2014 9:14 AM IST

rajinikanth_trish
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్న సినిమా ‘లింగా’. టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలోని ఓ సాంగ్ షూట్ ప్రసతుతం హైదరబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రజినీకాంత్ – సోనాక్షి సిన్హాలపై ఈ పాటని షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ షూటింగ్ అయ్యాక అబ్రాడ్ లో రజినీకాంత్ పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ ని షూట్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కోలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం ‘లింగ’లో బ్యూటిఫుల్ త్రిష ఓ స్పెషల్ సాంగ్ చేసిందని సమాచారం. ఇప్పటికే ఈ సాంగ్ కి సంబందించిన షూటింగ్ కూడా పూర్తయ్యిందని సమాచారం. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో త్రిష స్పెషల్ సాంగ్ అంటే ఆడియన్స్ కి స్పెషల్ బోనస్ అనే చెప్పాలి. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న రెండు పాత్రల్లో ఒక పాత్ర ప్రస్తుతానికి చెందినది అయితే మరొకటి 1947 కాలానికి చెందింది.

కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ సరసన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. రజినీకాంత్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు