
హుధూద్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలయిన విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తూ, అక్కడ ప్రజలను పరామర్శిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇదే బాటలో నడిచేందుకు అబ్బాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సంసిద్దత వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో ఒక స్టోర్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రామ్ చరణ్ మాట్లాడుతూ.. అవసరమైతే నేనూ కూడా బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తానని వ్యాఖ్యానించారు.
హుధూద్ తుఫాన్ భాదితుల సహాయార్ధం తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మొదట విరాళం అందజేసింది రామ్ చరణే. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 10 లక్షల రూపాయలు, విశాఖలోని రామకృష్ణ మిషన్ కోసం 5 లక్షల రూపాయలు విరాళం అందించారు. ధన సహాయంతో పాటు మందులు, ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంగళవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తెలిపారు.

