
చిన్నప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలనటుడుగా ఆ తర్వాత కమెడియన్ గా, హీరోగా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను నవ్విస్తున్న నటుడు అలీ. అలీ చేసే ప్రతి పాత్రలోనూ ఏదో ఒక కొత్తదనం మరియు డైలాగ్ డెలివరీని ట్రై చేస్తూ ఉంటాడు. అదే స్టైల్లో అలీ ఇప్పుడు నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ లో కూడా కనిపించనున్నాడు.
ఒక లైలా కోసం లో అలీ నాగ చైతన్య మామయ్యా లా కనిపించనున్నాడు. ఈ చిత్ర వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అలీ పాత్ర, అతని కామెడీ సినిమాకే మేజర్ హైలైట్ అవుతుందని
అంటున్నారు. విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. రేపు విడుదల కానున్న ఈ సినిమా నాగ చైతన్యకి మరో రొమాంటిక్ హిట్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు.

