
తన క్యారెక్టర్ బాగా రావడం కోసం ఎంత దూరం అయిన వెళ్ళే నటులలో విక్రం ఒకరు. తన తాజా చిత్రం ‘ఐ’ లోని మూడూ విభిన్న పాత్రల కోసం తన బాడీ లాంగ్వేజ్ ని మేక్ అప్ ని మారుస్తూ వుండడంతో పాటు బరువు పెరిగి మళ్లీ తగ్గారు.
శంకర్ దగ్గర ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేక్ అప్ ఆర్టిస్టులు వున్నారు. అయితే విక్రం తన మేక్ అప్ ని ఎక్కువ సేపు వుంచుకోవడానికి ఫ్రిడ్జ్ లో కుర్చునేవారని వదంతి వచ్చింది. ఇదిలావుండగా విక్రం అటువంటిది ఏమి లేదని కెమెరా లో వాళ్ళు పర్ఫెక్ట్ గా కనబడడానికి తీసుకున్న జాగ్రత్తలని కొంతమంది ఎక్కువ చేసి చెప్తున్నారని వదంతులని కొట్టి పారేశారు.
ప్రస్తుతం ‘ఐ’ చిత్రం డబ్బింగ్ దశలో వుంది. బిజియెం పనులు కూడా జరుగుతున్నాయి. ఎ. ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. దీపావళి విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయడానికి సిద్దం అవుతున్నారు.

