
ఒక చిన్న వీడియోతో మనందరి మనసులను టచ్ చేశారు రాజమౌళి. విశాఖ ప్రజలకు ఏదైనా సహాయం చేయాలనే ఐడియా రాజమౌళికి తట్టింది, తన మదిలో మెదిలిన ఆలోచనలను రాజీవ్ మీనన్ తో పంచుకున్నారు. వెంటనే రాజమౌళి ఆలోచనలకు రాజీవ్ రూపం ఇచ్చారు. అంతే కాదు, ఈ వీడియో ప్రజలకు చేరువ కావడానికి రాజమౌళి తన వంతు కృషి చేశారు.
‘షేర్ ది స్పిరిట్ అఫ్ దివాలి – వైజాగ్ నీడ్స్ యు’ అంటూ తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ నెటిజన్లలో స్ఫూర్తి నింపుతుంది. రెండున్నర నిముషాల నిడివి గల ఈ షార్ట్ ఫిల్మ్ నేడు యుట్యూబ్ లో విడుదలైంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరి హృదయంలో ఏదో చేయాలనే తపన, కోరిక కలుగుతున్నాయి. హుధూద్ తుఫాన్ ప్రళయంతో విశాఖలో సర్వస్వం కోల్పోయిన వారి కోసం మన దీపావళి పండుగ ఖర్చులో సగం డొనేట్ చేద్దాం అనే కాన్సెప్ట్ తో ఈ వీడియో రూపొందింది. సహాయం చేయాలనుకునే వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి డబ్బును పంపించండి.
వైజాగ్ లో ఉన్న మన సోదరుల బాధను కొంచం తగ్గించడానికి మనం ఏదైనా చేయగలమా..? మనం ఎం చేయగలమో ఈ వీడియోలో నేను చూపించాను. వారికి ఒక చిన్న భరోసా ఇద్దాం అని సోషల్ మీడియాలో రాజమౌళి పేర్కొన్నారు.
వీడియో చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

