చైతు కోసమే ‘ఒక లైలా కోసం’ కథ రెడీ చేశా – దర్శకుడు

చైతు కోసమే ‘ఒక లైలా కోసం’ కథ రెడీ చేశా – దర్శకుడు

Published on Oct 20, 2014 4:00 PM IST

Oka-Laila-Kosam2
నాగ చైతన్య కోసమే రాసిన కథ ‘ఒక లైలా కోసం’. చైతు బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా హీరో క్యారెక్టర్ డిజైన్ చేశాను. అందువల్ల సినిమా మొత్తం అతనే కనిపిస్తాడు. కథ విన్న తర్వాత ఎంత ఎగ్జైట్ అయ్యాడో..! సినిమాలో అంతే ఎనర్జిటిక్ గా నటించాడు. నేను చైతన్యను ఎలా చూపించాలి అనుకున్నానో..? 100% అలా చూపించాను. తన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో అతని డాన్స్ మూమెంట్స్ గాని, పెర్ఫార్మన్స్ గాని చాలా వైవిధ్యంగా ఉంటుంది. డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. సినిమా విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉంది. అని అన్నారు దర్శకుడు విజయ్ కుమార్ కొండా.

‘గుండెజారి గల్లంతయ్యిందే’ విజయం తర్వాత విజయ్ దర్శకత్వం వహించిన ఈ లవ్ & రొమాంటిక్ ఎంటర్టైనర్ గత శుక్రవారం విడుదలైంది. మొదటి ఆట నుండి ‘ఒక లైలా కోసం’ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. పూజ హెడ్గే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. కంప్లీట్ ఫ్యామిలీ అంతా కలసి హ్యాపీగా చూడదగిన సినిమాగా ‘ఒక లైలా కోసం’ ప్రసంశలు అందుకుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు