
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ – దీపిక పడుకొనే – అభిషేక్ బచ్చన్ కలిసి నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా దీపావళి కానుకగా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఒక్క హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఒక్క హిందీలోనే 100 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఒక్క హిందీలోనే కాకుండా తెలుగులో కూడా కలెక్షన్స్ బాగా రాబట్టుకుంటోంది.
హ్యాపీ న్యూ ఇయర్ సినిమా శురవారం 1.43 కొర్ల షేర్ కలెక్ట్ చేస్తే శని వారం 73 లక్షలు, ఆదివారం 76 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. ఒక్క తెలుగులోనే మొదటి వీకెండ్ లో 2.92 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఒక్క హిందీలోనే మూడు రోజుల్లో 104.10 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే, తమిళంలో మాత్రం 1.84 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. మొత్తంగా మూడు భాషల్లో కలుపుకుంటే 108.86 కోట్ల షేర్ సాదించి బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతోంది. బోమన్ ఇరాని, సోనూ సూద్ లు కూడా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఫరా ఖాన్ డైరెక్టర్.

