ఈ రోజే ‘కరెంట్ తీగ’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్.

ఈ రోజే ‘కరెంట్ తీగ’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్.

Published on Oct 29, 2014 11:45 AM IST

currentthiga1
మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘కరెంట్ తీగ’ సినిమా ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఈ రోజు జరగనుంది. అచ్చు ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఆడియో సూపర్ హిట్టయి శ్రోతలను అలరిస్తుంది. హైదరాబాద్ లో గల నారాయణమ్మ ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీ ఈ వేడుకకు వేదిక కానుంది. ఇదే వేదికపై వైజాగ్ తుఫాన్ భాదితుల కోసం ప్రత్యేకంగా చేసిన పాటను కూడా విడుదల చేస్తున్నట్టు హీరో మంచు మనోజ్ ట్విట్టర్ లో తెలిపారు.

‘ఈ రోజు 3 గంటలకు నారాయణమ్మ కాలేజీలో ‘కరెంట్ తీగ’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. వైజాగ్ ప్రజల కోసం చేసిన పాటను కూడా విడుదల చేస్తున్నాం’ అని మనోజ్ ట్వీట్ చేశారు.

జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమా 31న ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలలో విడుదలవుతుంది. సన్నీ లియోన్ ప్రత్యేక పాత్ర సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు