
‘వెన్నెల’, ‘ప్రస్థానం’, ‘ఆటోనగర్ సూర్య’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మరియు విమర్శకుల మెప్పు పొందిన డైరెక్టర్ దేవకట్ట. దేవకట్ట సినిమాలన్నీ ఎంతో ఇంటెన్స్ తో ఉన్న కంటెంట్ ని డీల్ చేస్తాయి. అలాగే కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో ఎక్కువ పేరు తెచ్చుకున్న హీరో మంచు విష్ణు. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా అంటే ఎలా ఉంటుంది. రెగ్యులర్ కి చాలా డిఫరెంట్ గానే ఉంటుందని ఆశించవచ్చు.
అవును.. మీరు వింటున్నది నిజమే.. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం.. దేవకట్ట తన తదుపరి సినిమా మంచు విష్ణు హీరోగా చేయనున్నాడు. ఈ సినిమా తమిళంలో హిట్ అయిన ‘అరిమ నంబి’ సినిమాకి రీమక్. ఇప్పటికే ఈ సినిమా తెలుగు వెర్షన్ కి తగ్గట్టు కథలో మార్పులు చేసారు. త్వరలోనే దేవకట్ట – విష్ణుల మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేస్తారు.

