అల్లు అర్జున్ బోయపాటి శ్రీను స్క్రిప్ట్ ఓకే చేస్తాడా.?

అల్లు అర్జున్ బోయపాటి శ్రీను స్క్రిప్ట్ ఓకే చేస్తాడా.?

Published on Oct 31, 2014 4:15 PM IST

boyapati_allu_arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు డైరెక్షన్ లో చేస్తున్న సినిమా సెట్స్ పై ఉంది. ఈ సినిమా షూటింగ్ కంటిన్యూగా జరుగుతోంది. ఇదిలా ఉంటే కుదిరిన సమయంలో అల్లు అర్జున్ తన తదుపరి సినిమా కోసం పలువురు డైరెక్టర్స్ నుంచి కథలు కూడా వింటున్నారు. ఈ లిస్టులో తాజాగా బోయపాటి శ్రీను చేరాడు. బోయపాటి శ్రీను ఇటీవలే అల్లు అర్జున్ ని కలిసి ఓ కథ వినిపించాడు. కథ విన్న బన్ని ప్రస్తుతం ఈ సినిమా చెయ్యలా.? లేదా.? అనే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

ఇప్పటికే బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తో చేయాల్సిన సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమా నవంబర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఒకవేళ బన్ని బోయపాటి శ్రీను కథకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక వచ్చే సంవత్సరం వీరి కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. మరి ఇప్పుడు బన్ని బోయ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా.? లేదా.? అన్నది చూడాలి. ఒకవేళ ఓకే అయితే వీరి కాంబినేషన్ లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని అభిమానులు ఆశించవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు