
విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘గోపాల గోపాల’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. భూకంపం సంభవించే సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుంది. తర్వాత మూవీ యూనిట్ కాశీ(వారణాసి) వెళ్లనుంది. అక్కడ కొన్ని రోజులు షూటింగ్ చేయనున్నారు.
పవన్ కళ్యాణ్ మోడరన్ శ్రీకృష్ణుడిగా, వెంకీ నాస్తికుడిగా నటిస్తున్నారు. వీరి లుక్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిందీలో సూపర్ సక్సెస్ సాధించిన ‘ఓ మై గాడ్’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. కిషోర్ పార్దసాని(డాలి) దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ సరసన శ్రియ నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

