
‘లెజెండ్’తో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన జగపతి బాబు వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఒకప్పటి ఈ ఫ్యామిలీ హీరో ఇంపార్టెంట్ క్యారెక్టర్లలో నటించిన తాజా సినిమాలు వరుసగా విజయాలు సాదిస్తున్నాయి. రజనీకాంత్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న విడుదల కానున్న ‘లింగ’ సినిమా కోసం జగపతి బాబు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘లింగ’ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు నేను మరో ఆలోచన లేకుండా వెంటనే ఓకే చెప్పేశాను. రజినీకాంత్ సినిమా ఇది. చాలా ఎక్కువ మంది ప్రేక్షకులకు సినిమా చేరువవుతుంది. కథ వినకుండానే సంతకం చేశాను. అని జగపతి బాబు తెలిపారు. ‘లింగ’ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో చేరుతుందని ధీమా జగపతి బాబు మాటల్లో వ్యక్తం అవుతుంది. ఈ సినిమా విడుదల తర్వాత తమిళంలో కూడా ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.

