
‘కత్తి’ సినిమాతో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఇళయ దళపతి విజయ్ తదుపరి సినిమాలో హన్సిక హీరోయిన్ గా నటిస్తున్నట్టు కన్ఫర్మ్ చేసింది. ‘ఇదొక ఫాంటసీ సినిమా. చింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్నారు. హన్సిక యువరాణి తరహా పాత్రలో నటిస్తుంది. తను గతంలో నటించిన సినిమాల కంటే ఈ సినిమా చాలా వైవిధ్యమైన సినిమా అని ఆమె సన్నిహితులు తెలిపారు.
శృతి హాసన్ మరొక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి, ‘ఈగ’ ఫేం సుదీప్ కీలక పాత్రలలో కనిపిస్తారు. నవంబర్ 10 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. పక్కా కమర్షియల్ ఫాంటసీ సినిమా అట.
‘వీరం’ తర్వాత శివ దర్శకత్వంలో అజిత్ నటించబోయే సినిమా కోసం తనను ఎవరూ సంప్రదించలేదని హన్సిక తెలిపింది. గత కొన్ని రోజులుగా అజిత్ తో హన్సిక రొమాన్స్ చేయబోతుంది అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది.

