
టాలెంట్ వున్న దర్శకులలో చంద్రశేఖర్ యేలేటి ఒకరు. ఆయన ఇటీవలే తీసిన సాహసం సినిమా మంచి విజయం సాధించింది. తన తదుపరి చిత్రం సాయికొర్రపాటి నిర్మాణంలో వుండనుంది. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో వెంకటేష్ కధానాయకుడిగా నటించే అవాకాశం వుందట
కొన్నేళ్ళక్రితం చంద్రశేఖర్ యేలేటికి వెంకీని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ఈ నిర్మాణసంస్థ 12 నుండి 17 సంవత్సరాల మధ్య వయసుగల అమ్మాయిలకు ఆడిషన్ కూడా చేసింది. వెంకీ ప్రస్తుతం ‘గోపాల గోపాల’ షూటింగ్ లో బిజీగా వున్నాడు. వెంకీ దశరధ్ సినిమాని కూడా యాక్సెప్ట్ చేసినట్టు సమాచారం

