భోపాల్ లో సందడి చేస్తున్న శృతి హాసన్

భోపాల్ లో సందడి చేస్తున్న శృతి హాసన్

Published on Nov 2, 2014 1:16 PM IST

Shruti-Hassan
సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ శృతి హాసన్ భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ్, హిందీ అని అన్ని భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం శృతి హాసన్ హిందీ సినిమా షూటింగ్ లో భాగంగా భోపాల్ లో ఉంది. తిగ్మన్షు దులై దర్శకత్వం వహిస్తున్న యార సినిమా షూటింగ్ ప్రస్తుతం భోపాల్ లో జరుగుతోంది. ఇర్ఫాన్ ఖాన్ – విద్యుత్ జమాల్ ఇందులో హీరోలుగా కనిపించనున్నారు.

శృతి హాసన్ నటించిన ‘పూజ’ సినిమా ఇటీవలే విడుదలై తెలుగు , తమిళ భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం శృతి హాసన్ హిందీలో మొత్తం 4 సినిమాలు చేస్తోంది. ఇందులో రెండు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంటే మరో రెండు సెట్స్ పై ఉన్నాయి. ఇది కాకుండా తమిళంలో విజయ్ సరసన ఓ సినిమా చేయనుంది. తెలుగు మహేష్ బాబు సరసన చేయనున్న సినిమా ప్రసతుతం సెట్స్ పై ఉంది.

తాజా వార్తలు