
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘రారా కృష్ణయ్య’ సినిమాల తర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం యంగ్ హీరో సందీప్ కిషన్ చేసిన మరో ప్రయత్నమే ‘జోరు’. ‘గుండెల్లో గోదారి’ లాంటి డిఫరెంట్ సినిమా తీసి విమర్శకులను మెప్పించిన కుమార్ నాగేంద్ర ఈ సినిమాకి డైరెక్టర్. తన మొదటి సినిమాలనే ఇది కూడా ప్రయోగాత్మక సినిమా అని కొందరు అనుకుంటున్నారు. కానీ హీరో సందీప్ కిషన్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
‘కుమార్ నాగేంద్ర మొదటి సినిమా గుండెల్లో గోదారి’ సినిమాకి పూర్తి భిన్నంగా జోరు సినిమా ఉంటుంది. దానికి దీనికి అస్సలు సంబంధం ఉండదు. కుమార్ ఈ సారి ఓ సింపుల్ స్టొరీలో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా పలు ట్విస్ట్ లను ప్లాన్ చేసుకొని పూర్తి కామెడీగా ఉండేలా ఈ సినిమాని తీసాడు. ప్రతి ఒక్కరికీ నచ్చేలా జోరులో మాస్ కామెడీ ఉంటుందని’ సందీప్ కిషన్ తెలిపాడు.
సందీప్ కిషన్ సరసన రాశి ఖన్నా, ప్రియ బెనర్జీ, సుష్మలు హీరోయిన్స్ గా నటించారు. మొదరిసారి బ్రహ్మానందం – సందీప్ కిషన్ కాంబినేషన్ లో వచ్చే కామెడీ కూడా హైలైట్ అవుతుందని ఈ చిత్ర టీం చెబుతోంది. అర్జున్ సమర్పణలో శ్రీ కీర్తి ఫిల్మ్స్ పతాకంపై అశోక్, నాగార్జున ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి సెన్సార్ నుంచి ‘ఏ’ సర్టిఫికేట్ వచ్చింది.

