‘జ్యోతిలక్ష్మి’ కోసం చార్మీ త్యాగం చేస్తుంది.

‘జ్యోతిలక్ష్మి’ కోసం చార్మీ త్యాగం చేస్తుంది.

Published on Nov 10, 2014 4:44 PM IST

charmi
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చార్మీ ప్రధాన పాత్రలో నటించబోయే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘జ్యోతిలక్ష్మి’. మల్లాడి వెంకట కృష్ణమూర్తి రచించిన ప్రసిద్ద నవలా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు పూరి తెలిపారు. చార్మీ ‘జ్యోతిలక్ష్మి’ పాత్రలో అత్యుత్తమ నటన కనబరించేందుకు తన వంతు కృషి చేస్తుంది.

దర్శకుడు పూరి జగన్నాధ్ ఆదేశాల మేరకు ప్రస్తుతం చార్మీ బరువు తగ్గే పనిలో బిజీగా ఉంది. స్ట్రిక్ట్ డైట్ మైంటైన్ చేస్తుంది. ఉడికించిన కాయగూరలు, కొద్దిపాటి మిత ఆహారం తీసుకుంది. ఈ ప్రాసెస్ ను లవ్ చేస్తున్నాని చార్మీ చెప్పింది. తనకు ఇష్టమైన ఆహారం తినకుండా నోరు కుట్టేసుకుంది. ‘జ్యోతిలక్ష్మి’లో తన పాత్ర అద్బుతంగా రావడం కోసం చార్మీ ఫుడ్ త్యాగం చేస్తుందనమాట .

ఎన్టీఆర్ హీరోగా పూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా విడుదలైన తర్వాత ‘జ్యోతిలక్ష్మి’ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హీరోయిన్ ఎలా ఉండాలి అనే విషయంలో పూరి జగన్నాధ్ చాలా క్లారిటీగా ఉన్నారు.

charmi-twet

తాజా వార్తలు