వీకెండ్ తర్వాత ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ కలెక్షన్స్ బాగున్నాయి.

వీకెండ్ తర్వాత ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ కలెక్షన్స్ బాగున్నాయి.

Published on Nov 12, 2014 11:55 PM IST

Brother-of-bommali
గత శుక్రవారం విడుదలైన ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’కి మంచి ఓపెనింగ్స్ లభించాయి. అల్లరి నరేష్ తన మార్క్ కామెడీతో ప్రేక్షకులకు వినోదం అందించాడు. సినిమా విజయంలో నరేష్ నటన, కార్తీక వైవిధ్యమైన పాత్ర కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా సినిమా కథ, కథనం, కథనంలో నుండి క్రియేట్ అయిన వినోదం వర్కౌట్ అయ్యాయి. వీకెండ్ తర్వాత కూడా ఈ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. సోమవారం నుండి ఇప్పటివరకు మంచి వసూళ్లను నమోదు చేసింది.

ఓవర్సీస్ లో అల్లరి నరేష్ కెరీర్ లో అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమా ఇదే. చిన్ని కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా నటించింది. కోన వెంకట్ పాత్రలో స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కడుపుబ్బా నవ్వించారు.

తాజా వార్తలు