నో చెప్పిన రజినీకాంత్.

నో చెప్పిన రజినీకాంత్.

Published on Nov 20, 2014 2:15 PM IST

rajinikant
ఎన్నటకీ రాజకీయాలలో అడుగుపెట్టే ప్రసక్తి లేదని సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టం చేశారు. ప్రముఖ ఛానల్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారా..? అనే ప్రశ్నకు నో… నెవర్ అని సమాధానం ఇచ్చారు.

‘లింగ’ ఆడియోలో రాజకీయాలపై తన మనసులో భావాలను వెల్లడించిన తర్వాత త్వరలో రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారు..! అనే వార్తలు గుప్పుమన్నాయి. వాటికి రజిని చెక్ పెట్టినట్టు అయ్యింది. రాజకీయాలు భయంకరమైనవి, లోతైనవి. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి. ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు సేవ చేయగలనా..? లేదా..? అని ఆలోచిస్తున్నాను. అని ‘లింగ’ ఆడియోలో చెప్పిన మాటలను మరోసారి గుర్తుచేశారు.

తాజా వార్తలు