
‘రన్ రాజా రన్’ సినిమా సక్సెస్ సాధించడంతో విజయానందంలో వున్న శర్వానంద్ తనతదుపరి సినిమాతో రెడీ అవుతున్నాడు. ‘మళ్ళి మళ్ళి ఇది రానిరోజు’ అనే సినిమాతో మనముందుకు రానున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సినిమా ఆడియో డిసెంబర్ లో విడుదలకానుంది
ఈ సినిమాకు నిత్యామీనన్ హీరోయిన్. క్రాంతి మాధవ్ దర్శకుడు. ఈ దర్శకుడు 2012లో ‘ఓనమాలు’ సినిమా తెరకెక్కించాడు. ఓనమాలు వంటి సందేశాత్మక సినిమా కాకుండా ఈ చిత్రాన్ని కమర్షియల్ బాటలో తెరకేక్కించనున్నాడు
ఈ సినిమాను క్రియేటీవ్ కమర్షియల్స్ బ్యానర్ పై అలగ్జాందర్ వల్లభనేని నిర్మిస్తున్నాడు

