సెన్సార్ కి సిద్దమయిన ‘లింగ’

సెన్సార్ కి సిద్దమయిన ‘లింగ’

Published on Nov 22, 2014 10:19 AM IST

lingaa-sencor
సూపర్ స్టార్ రజినీకాంత్ డ్యూయల్ రోల్ లో నటించిన తాజా సినిమా ‘లింగ’. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెన్సార్ కి సిద్దమయింది. నవంబర్ 24, సోమవారం నాడు ‘లింగ’ సెన్సార్ సెన్సార్ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇటీవల కాలంలో రజినీకాంత్ కెరీర్ లో అతి తక్కువ రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అయిన సినిమా ‘లింగ’. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా అంతే వేగంగా జరిగాయి. కేవలం 24 గంటల్లో రజిని తన డబ్బింగ్ కంప్లీట్ చేశారు.

కేయస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటించారు. జగపతి బాబు విలన్ గా నటించారు. ఏఅర్ రెహమాన్ సంగీతం అందించిన పాటలు ఇటివలే విడుదలయ్యాయి. రజనీ పుట్టినరోజుని పురస్కరించుకుని డిసెంబర్ 12న ‘లింగ’ సినిమాను విడుదల చేస్తున్నారు. రాక్ లైన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. పతాకంపై కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు. ఈరోస్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది.

తాజా వార్తలు