
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాంటి సూపర్ హిట్ కాంబినేషన్ లో ఇప్పుడు మరో సినిమా తెరకెక్కుతోంది. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం కోకపేటలో వేసిన ఓ స్పెషల్ సెట్లో అల్లు అర్జున్ పై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.
షూటింగ్ గురించి కాస్త పక్కన పెడితే ఈ సినిమాకి టైటిల్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. కానీ మాకు ఈ సినిమా రిలీజ్ డేట్ పై కచ్చితమైన సమాచారం అందింది. మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాని 2015 ఫిబ్రవరి 5న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
అల్లు అర్జున్ కి సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన దేవీశ్రీ ప్రసాద్ మరోసారి ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. జులాయి చిత్ర నిర్మాత అయిన కె. రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. కన్నడ సూపర్ స్టార్ స్టార్ ఉపేంద్ర, స్నేహ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

