ప్రత్యేకం : మహేష్ బాబు – త్రివిక్రమ్ – సమంత టాక్ షో విశేషాలు

ప్రత్యేకం : మహేష్ బాబు – త్రివిక్రమ్ – సమంత టాక్ షో విశేషాలు

Published on Nov 24, 2014 11:25 PM IST

Mahesh-samantha-thrivikaram
టాలీవుడ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హుదూద్ బాధితుల సహాయార్ధం నిర్వహిస్తున్న వేడుక ‘మేము సైతం – వుయ్ లవ్ వైజాగ్’. ఈ వేడుకకి ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, హీరోయిన్స్ అంతా అలా చీఫ్ గెస్ట్ లా వచ్చి వేడుకని చూడకుండా, ప్రతి ఒక్కరూ ఒక్కో కార్యక్రమంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నారు. నవంబర్ 30న జరిగే టెలీథాన్ ప్రోగ్రాం లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కూడా పెర్ఫార్మన్స్ చేయనున్నారని తెలిపాము. అది కూడా టాక్ షో ఫార్మాట్ లో ఉంటుందని తెలియజేశాం.

ఈ విషయం గురించి మీకో ప్రత్యేకమైన న్యూస్ ని అందిస్తున్నాం. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ టాక్ షో కాన్సెప్ట్ లో వ్యాఖ్యాతగా కూడా త్రివిక్రమ్ వ్యవహరించనున్నాడు. ఈ టాక్ షోకి రీసెంట్ గా మరో అట్రాక్షన్ యాడ్ అయ్యింది. అదే టాలీవుడ్ డ్రీం గర్ల్ సమంత. ఈ త్రివిక్రమ్ టాక్ షో లో మహేష్ బాబుతో పాటు సమంత కూడా ముఖ్య అతిధిగా హాజరుకానుంది. ఇలా వీరు ముగ్గురు కలిసి చేయనున్న ఈ టాక్ షో టెలీథాన్ లో ప్రసారం చేస్తారు. ఈ టాక్ షో కి సంబందించిన షూటింగ్ నవంబర్ 27న జరగనుంది. ఈ టాక్ షో రెగ్యులర్ గా ఉండకుండా సంథింగ్ డిఫరెంట్ గా ఉండేలా త్రివిక్రమ్ డిజైన్ చేసాడని సమాచారం.

ఒక్క పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, సమంత లాంటి స్టార్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ వేడుకలో ఏదో ఒక ప్రోగ్రాం చేసి ఎంటర్టైన్ చేయనున్నారు. అంతే కాకుండా మంచు ఫ్యామిలీ వారు కబడ్డీ మ్యాచ్ తో, మరో కొంతమంది స్టార్స్ క్రికెట్ మ్యాచ్ తో, మరికొంతమంది స్టార్స్ తంబోలా గేమ్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

తాజా వార్తలు