
నటిగా గుర్తింపు తెచ్చుకుని దర్శకురాలి అవతారమెత్తిన రేణు దేశాయ్ తన జన్మదినం సందర్భంగా యు ట్యూబ్ ద్వారా ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలిపింది. దీంతో పవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్న లెక్కలేనన్ని పుకార్లకు నేటితో ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది.
పవన్ తనను ‘సుబ్బమ్మ’, ‘సు’ అని పిలుస్తాడని, పవన్ నటించిన ‘జానీ’ సినిమా పరాజయం పాలైన సందర్భంలో తన పారితోషికం తిరిగి ఇచ్చేసాదని తెలిపింది. వారి విడాకుల సమయంలో వచ్చిన 40కోట్ల పరువు నష్టం పుకార్లను కొట్టిపారేసింది. విడాకుల తరువాత ఏకాంతతను అలవాటు చేసుకుంటున్నానని ప్రస్తుతానికి నా పిల్లలే నాకు సర్వస్వమని చెప్పుకొచ్చింది

