‘లింగ’డి తుఫానుకి తట్టుకుని నిలబడిన ‘అలా ఎలా?’

‘లింగ’డి తుఫానుకి తట్టుకుని నిలబడిన ‘అలా ఎలా?’

Published on Dec 13, 2014 9:12 AM IST

ala-ela
మౌత్ పబ్లిసిటీకి మించిన ప్రచార మాధ్యమం మరొకటి లేదని ‘అలా ఎలా?’ సినిమా మరోసారి రుజువు చేసింది. సినిమా విడుదలైన రెండు వారాల 6స్క్రీన్ లను కొత్తగా జతకలుపుకుని రికార్డు సృష్టించింది. ఆంధ్రా, తెలంగాణాలలో ‘లింగ’ సినిమా మెజారిటీ సంఖ్యలో విడుదలకు నోచుకున్న క్రమంలో చాలా సినిమాలకు వున్న థియేటర్ లే ఎత్తేస్తుంటే ఈ చిత్రం తన ప్రదర్శనల సంఖ్య పెంచుకుని ఆశ్చర్యపరిచింది

ఇదంతా ఎలా సాధ్యమని అనుకుంటున్నారా? ‘అలా ఎలా?’ సినిమాలో అనవసరమైన కామెడీ ట్రాక్ లు, ఇరికించిన మాస్ ఎలిమెంట్లు లేకుండా ప్రధాన తారాగణమంతా మంచి నటన కనబరచడంతో సాధ్యపడింది. కొత్త దర్శకుడు అన్నీష్ కృష్ణ ఆకట్టుకున్నాడు. రాహుల్ రవిచంద్రన్ ప్రధాన పాత్రధారి. భార్యా భాదితుడిగా వెన్నెల కిషోర్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది

తాజా వార్తలు