ఫిబ్రవరికి వెళ్ళిన ఎన్.టి.ఆర్ ‘టెంపర్’

ఫిబ్రవరికి వెళ్ళిన ఎన్.టి.ఆర్ ‘టెంపర్’

Published on Dec 13, 2014 12:45 PM IST

Temper
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న సినిమా ‘టెంపర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవలే హరికృష్ణ కుమారుడు నందమూరి జానకిరామ్ చనిపోవడంతో ఎన్.టి.ఆర్ సినిమాకి కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చాడు. ఈ సినిమా మొదలైన నాటి నుంచే 2015 జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని సంక్రాంతి బారి నుంచి తప్పుకుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న వార్తల ప్రకారం ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు. పలు సార్లు ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడడమే ఈ సినిమా ఫిబ్రవరికి వెళ్ళడానికి కారణం అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

ఇంకా టెంపర్ లో భాగంగా ఓ పాట, ఫైట్ మరియు కొన్ని కీలక సన్నివేశాలు మిగిలి ఉన్నాయి. షూటింగ్ మొదలైనప్పటి నుంచే తక్కువ టైంలో రిలీజ్ చెయ్యాలి అనుకోవడంతో షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే డబ్బింగ్ కార్యక్రమాలను కూడా ప్రారంభమయ్యాయి. ఎన్.టి.ఆర్ పోలీస్ ఆఫీసర్ గానే కాకుండా సరికొత్త మేకోవర్ తో స్టైలిష్ లుక్ లో కూడా కనిపించనున్నాడు. ఆ లుక్ కి సంబందించిన ఫోటోలు ఇటీవలే విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసాయి.

ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘బాద్షా’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ఎన్.టి.ఆర్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు