2015లో సొంత బ్యానర్ లో రానా సినిమా

2015లో సొంత బ్యానర్ లో రానా సినిమా

Published on Dec 14, 2014 8:41 PM IST

Rana_Daggubati

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చాడు ఆ తర్వాత అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో రానా దగ్గుబాటి. మామూలుగా ఇలాంటి పెద్ద ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు అంటే తనని హోం బ్యానర్ ద్వారానే లాంచ్ చేస్తారు. కానీ రానా మొదటి సినిమా నుంచి ఇప్పుడు చేస్తున్న సినిమాల వరకూ ఒక్కటి కూడా హోం బ్యానర్ లో చేయలేదు. ఎట్టకేలకు రానా దగ్గుబాటి హోం బ్యానర్ లో చేయనున్నాడని డి. సురేష్ బాబు తెలియజేశారు.

సురేష్ ప్రొడక్షన్స్ అధినేత అయిన డి. సురేష్ బాబు ఈ రోజు ట్విట్టర్ ద్వారా ‘2015లో రానా దగ్గుబాటితో హోం బ్యానర్ లో మూవీ ఉంటుందని’ తెలియజేశారు. ఈ రోజు రానా పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని అనౌన్స్ చేసారు. చాలా రోజులుగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రానా చేసే సినిమాకి హను రాఘవపూడి మరియు పరశురాం డైరెక్ట్ చేస్తారని అంటున్నారు. కావున ఈ ఇద్దరిలో ఒకరితో రానా సినిమా ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. రానా ప్రస్తుతం బాహుబలి సినిమాని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇది కాకుండా తను షూటింగ్ ఫినిష్ చేసిన రుద్రమదేవి మరియు బేబీ సినిమాలు రిలీజ్ కి సిద్దంగా ఉన్నాయి.

తాజా వార్తలు