మేలో రానున్న మహేష్ – కొరటాల మూవీ.?

మేలో రానున్న మహేష్ – కొరటాల మూవీ.?

Published on Dec 15, 2014 8:21 AM IST

Mahesh-Babu-Koratala-Shiva

‘ఆగడు’ సినిమా తర్వాత షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే కొరటాల శివ సినిమాకి సంబందించిన షూటింగ్ ని మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఇప్పటికే పూణే షెడ్యూల్ ని పూర్తి చేసారు. ఆ తర్వాత్ షార్ట్ బ్రేక్ ఇచ్చిన టీం తాజా షెడ్యూల్ ని ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభించింది. కంటిన్యూగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హైదరబాద్ షెడ్యూల్ షూటింగ్ లో శృతి హాసన్ కూడా పాల్గొంటోంది.

ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఏప్రిల్ కల్లా షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ఫినిష్ చేసి మే 1న సమ్మర్ కానుకగా రిలాజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు స్టైలిష్ గా కనిపించనున్న ఈ సినిమాలో శృతి హాసన్ కూడా గత సినిమాలకంటే ఎక్కువగా గ్లామర్ ట్రీట్ ఇవ్వనుందని సమాచారం. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, సంపత్ రాజ్ లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘మిర్చి’ లాంటి సూపర్ హిట్ అందించిన కొరటాల శివ ఈ సినిమాతో మహేష్ బాబు ఎదురు చూస్తున్న సూపర్ హిట్ మూవీ అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

తాజా వార్తలు