
వరుణ్ తేజ్, పూజా హెడ్గే జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించిన సినిమా ‘ముకుంద’. ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. నేడు ‘ముకుంద’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికేట్ ప్రధానం చేసింది. ఈ నెల 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వరుణ్ తేజ్ తొలి సినిమాగా ‘ముకుంద’పై మెగా అభిమానులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మిక్కి జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై సినిమా తెరకెక్కింది.

