బాలీవుడ్ సూపర్ స్టార్ గోవిందాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రెండు దశాబ్దాలకు పైగా హిందీ చిత్ర ప్రేక్షకులను వినోదం అందించారు. కొంత కాలం గ్యాప్ తర్వాత ఇటివలే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే ప్రస్తుతం గోవిందా సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు.
ముంబై మీడియా సమాచారం ప్రకారం.. సౌత్ ఇండియన్ దర్శకనిర్మాతలతో గోవిందా చర్చలు జరుపుతున్నారు. బాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఇప్పుడు సౌత్ సినిమాలను తెరకేక్కుతున్నాయి. అందుకే గోవిందా సినిమాలపై కన్నేశాడు. ఇక్కడ స్టార్ హీరోల సినిమాలలో ప్రాముఖ్యత గల పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. గతంలో పలు తెలుగు, తమిళ సినిమాలను హిందీలో రీమేక్ చేసి భారి విజయాలు అందుకున్నాడు గోవిందా. ఇప్పుడు సౌత్ సినిమాలలో రాకింగ్ ఎంట్రీ ఇస్తాడని ఆశిద్దాం.


