
గత కొన్నిరోజల క్రితమే యంగ్ హీరో రామ్ మరియు కొత్త దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ‘శివం’ అనే టైటిల్ తో సినిమా రానుందని తెలిపాము. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ కోసం సంచలనాత్మక హీరోయిన్ రాశీఖన్నా ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.
అయితే ఈ వార్తకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనా విడుదలకాలేదు. ‘ఊహలు గుసగుసలాడే’ విజయం తర్వాత రాశీఖన్నాకి మంచి పేరు రావడం మనకు తెలిసినదే. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తారు. రామ్ ప్రస్తుత ప్రాజెక్ట్ ‘పండగ చేస్కో’ షూటింగ్ పూర్తికావస్తుంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.

