హంపి వెళ్లనున్న రవితేజ ‘కిక్ 2’

హంపి వెళ్లనున్న రవితేజ ‘కిక్ 2’

Published on Jan 27, 2015 12:02 PM IST

Kick2

మాస్ మహారాజ రవితేజకి కమర్షియల్ గానే కాకుండా తన కెరీర్ కి బిగ్గెస్ట్ బూస్టప్ ఇచ్చిన సినిమా ‘కిక్’. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే పాత్రతో తెరకెక్కిన ఈ సినిమాకి సీక్వెల్ గా ‘కిక్ 2’ సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఫస్ట్ పార్ట్ లో ఉండే రవితేజ – ఇలియానాల వారసుడి కథే ఈ సినిమా. ఇటీవలే జైసల్మీర్ లో ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ ని షూట్ చేసారు. ఆ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం హైదరాబాద్ చేరుకున్నారు. కొద్ది రోజుల పాటు ఈ చిత్ర టీం హైదరాబాద్ లో షూట్ చేయనున్నారు.

ఈ చిత్ర టీం తెలిపిన సమాచారం ప్రకారం కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఓ కీలక షెడ్యూల్ షూటింగ్ కోసం ఈ చిత్ర టీం హంపి వెళ్లనున్నారు. సినిమాలో ఎన్నో కీలకమైన ఎపిసోడ్స్ ని హంపిలో షూట్ చేయనున్నారు. హంపి షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 26న రవితేజ బర్త్ డే కానుకగా ఈ చిత్ర ఫస్ట్ టీజర్ ని కూడా లాంచ్ చేసారు.

తాజా వార్తలు