యాంగ్రీ యంగ్ మాన్ గా ఎన్నో పవర్ఫుల్ సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరో డా. రాజశేఖర్. రాజశేఖర్ ని ఒక నటుడిగా పక్కన పెడితే ఆయన స్వతహాగా మెడిసిన్ కంప్లీట్ చేసిన ఒక డాక్టర్. హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి కెరీర్ లో బిజీగా ఉన్నా డాక్టర్ గా కూడా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హోమియోపతి, ఆయుర్వేదిక్, అల్లోపతి, చైనీస్ మెడిసిన్స్ పైన రీసర్చ్ చేసాడు. ఫైనల్ గా అన్నిటికంటే హోమియోపతీనే బెస్ట్ అని రాజశేఖర్ అంటున్నాడు. ఇది చాలా మందికి తెలియని విషయం.
మరో తెలియని విషయం ఏమిటంటే కెరీర్లో బిజీగ ఉంటూనే రాజశేఖర్ ఇండస్ట్రీలో కేన్సర్ తో బాధపడుతున్న చాలా మందికి ఆయన చికిత్స కూడా అందించాడు. గతంలో సాయి కుమార్ వాళ్ళ ఫాదర్ పిజే శర్మకి, కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యంలకు కేన్సర్ కి ట్రీట్ మెంట్ ఇచ్చాడు. ఇటీవలే చనిపోయిన నటుడు ఆహుతి ప్రసాద్ కి కూడా చివరి నెల రోజులు రాజశేఖర్ చికిత్స చేసాడు. ప్రస్తుతం రాజశేఖర్ మూవీ మొఘల్ డా. డి. రామానాయుడుకి చికిత్స అందిస్తున్నాడు. రాజశేఖర్ ట్రీట్ మెంట్ మొదలు పెట్టక రామానాయుడు ఆరోగ్యం చాలా వరకూ మెరుగైందని సమాచారం. ఒక నటుడిగానే కాకుండా అవసరం అనుకున్న ప్రతి ఒక్కరికీ ట్రీట్ మెంట్ చేయడంలో ముందున్న డా. రాజశేఖర్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి.
రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గడ్డం గ్యాంగ్’. ఈ సినిమా ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.


