
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఎన్.టి.ఆర్ నటించిన టెంపర్ ఆడియో రిలీజ్ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో జరగనుంది. ఈ ఆడియోని గ్రాండ్ గా చెయ్యడానికి శ్రేయాస్ మీడియా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ టెంపర్ ఆడియో లాంచ్ ని మా 123తెలుగు.కామ్ లో లైవ్ స్ట్రీమింగ్ అందిస్తున్నాం. సాయంత్రం 6:30 గంటల నుండి మల్లెమాల టీవీలో లైవ్ గా చూడొచ్చు. మొదటి సారిగా ఎన్.టి.ఆర్ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.
బాగా గ్రాండ్ గా జరగనున్న ఈ ఈవెంట్ కి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ హై వోల్టేజ్ ఎంటర్టైనర్లో ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అలాగే ఫిబ్రవరి 12న ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మధురిమ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంటే, సోనియా అగర్వాల్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. టెంపర్ ఆడియో లాంచ్ ఎక్స్ క్లూజివ్ కవరేజ్ కోసం 123తెలుగు.కామ్ లేదా మల్లెమాల టీవీ ని విజిట్ చేస్తూ ఉండండి.

