
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 100% కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సినిమా ‘టెంపర్’. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టోటల్ షూటింగ్ పార్ట్ శనివారంతో ముగిసింది. హీరో హీరోయిన్లు ఇద్దరిపై చిత్రీకరించిన డ్యూయెట్ పూర్తవడంతో గుమ్మడికాయ కొట్టేశారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే బాలన్స్ ఉన్నాయి. ఇటివల విడుదలైన ట్రైలర్, సాంగ్ ప్రోమోలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఫిబ్రవరి 13న సినిమా విడుదల కోసం నందమూరి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించారు. ఇండస్ట్రీ వర్గాలలో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడడంతో బిజినెస్ బాగా జరుగుతుందని సమాచారం.

