
తెలుగు వారియర్స్ టీం ఎంతో సక్సెస్ఫుల్ గా సిసిఎల్ 5 లో దూసుకుపోతోంది. ప్రతి మ్యాచ్ లలోనూ మంచి ఆటతీరును కనబరుస్తూ వరుసగా విజయాలను అందుకొని ఫైనల్స్ లోకి వెళ్ళింది. నిన్న జరిగిన సెమీ ఫైనల్స్ లో తెలుగు వారియర్స్ టీం ముంబై హీరోస్ తో తలపడింది. తెలుగు వారియర్స్ టీం అంతా కలిసి కలిసి కట్టుగా ఆడి సమీ ఫైనల్స్ లో ముంబై హీరోస్ ని ఒర్దించి ఫైనల్స్ లోకి వెళ్ళింది.
మొదటగా టాస్ గెలిచిన అఖిల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అనుకున్నట్టుగానే తెలుగు వారియర్స్ బౌలర్స్ ముంబై హీరోస్ ని కట్టడి చేసారు. ఆ తర్వాత్ అబ్యాటింగ్ కి వహ్హిన తెలుగు వారియర్స్ టీం మొదటి నుంచి దూకుడుగా ఆడి అనుకున్న లక్ష్యాన్ని చేధించారు. తెలుగు వారియర్స్ తెంలోని ప్రిన్స్ 63 పరుగులు చేయగా, సుదీర్ బాబు 53 పరుగులు చేసి టీంకి విజయాన్ని అందించారు. ఈ రోజు సాయత్రం జరగనున్న ఫైనల్స్ లో తెలుగు వారియర్స్ టీం చెన్నై రైనోస్ తో తలపడనుంది.

