
ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్ర రావుగారు భవిష్యత్తులో మరిన్ని భక్తిరసాత్మక చిత్రాలను తెరకెక్కించనున్నారు. ఈ మౌన ముని ఇటీవలె విశాఖపట్నంలో సింహాచలం దేవస్థానాన్ని దర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ త్వరలో ‘అన్నమయ్య’ సినిమా వంటి భక్తిరసాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తానని, దానిపేరు ‘కృష్ణమయ్య ‘ అని తెలిపారు.
ఎన్నో కమర్షియల్ విజయాలను అందించిన రాఘవేంద్ర రావు ‘అన్నమయ్య’ సినిమాతో భక్తి సంద్రంలో ప్రేక్షకులను పునీతులనుచేశారు. ఆ తరువాత రామదాసు, షిరిడి సాయి వంటి సినిమాలను తీసారు. త్వరలో నాగ్ – రాఘవేంద్ర రావుల మరో భక్తిరసాత్మక చిత్రం మొదలుకానుంది. ఈ సినిమాలో సైతం వెంకటేశ్వర వైభవం చాటనున్నారని తెలుస్తుంది.

