
తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో, ప్రముఖ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా వచ్చిన హర్రర్ కామెడీ మూవీ ‘గీతాంజలి’. ఈ సినిమా గత సంవత్సరం తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రముఖ రచయిత కోనా వెంకట్ సమర్పిస్తూ రైటర్ గా పనిచేసిన ఈ సినిమా చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. హర్షవర్ధన్ రాణే, బ్రహ్మానందం, రావు రమేష్, సత్యం రాజేష్, శకలక శంకర్, మధునందన్ కీలక పాత్రలు పోషించారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు పోయాయి. తెలుగులో అంజలి చేసిన పాత్రని హిందీలో ఎవరు చేస్తారా అనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే అంజలి సినిమాకి సీక్వెల్ తీసే పనిలో ఈ చిత్ర టీం ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తైన ఈ సీక్వెల్ లో కలర్స్ స్వాతి హీరోయిన్ గా కనిపించనుంది. అలాగే గీతాంజలి సీక్వెల్ కి త్రిపుర అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు

