
అందాల భామ కృతి సనన్ ఇటు దక్షిణాదిన అటు బాలీవుడ్ ని సైతం ఒక ఊపు ఊపేసింది. వరుసపెట్టి ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లకు సంతకం చేస్తూ వస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఒక సినిమాను అంగీకరించింది.
ఫిలిం నగర్ లో వినిపిస్తున్న కధనాల ప్రకారం ఈ అమ్మడు షారుఖ్, వరుణ్ ధావన్ ల సరసన ఒక చిత్రంలో నటిస్తుందట. ముందుగా ఈ స్థానంకోసం పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలించినా చివరికి ఆ అవకాశం కృతికి మాత్రమే దక్కిందట. తెలుగులో సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగచైతన్య సరసన నటిస్తుంది.

