
మలయాళ, తెలుగు భాషల్లో మంచి విజయంతో పాటు విమర్శకుల ప్రసంశలు పొందిన సినిమా ‘దృశ్యం’. ఈ సినిమా విజయానికి కథ, కథనం, హీరో క్యారేక్టరైజేషన్ తో పాటు ఐజీ క్యారెక్టర్ కూడా ముఖ్య భూమిక పోషించింది. తెలుగు ‘దృశ్యం’లో నదియా ఐజీ పాత్రలో అద్బుతమైన నటన కనబరిచారు. ఇప్పుడు ఇదే పాత్రలో నటించడానికి ప్రముఖ హీరోయిన్ టబు సన్నద్ధం అవుతున్నారు.
హిందీలో అజయ్ దేవగన్ హీరోగా ‘దృశ్యం’ను రీమేక్ చేస్తున్నారు. నిశికాంత్ కామత్ దర్శకత్వం వహిస్తున్న ఈ రీమేక్ లో ఐజీ పాత్రలో టబు నటిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం అవుతుంది. తమిళంలో ఈ సినిమాను ‘పాపనాశనం’ పేరుతో కమల్ హాసన్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

