
గత కొంత కాలంగా బాక్స్ ఆఫీసు వద్ద సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఫుల్ కసి మీద చేసిన సినిమా ‘టెంపర్’. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో గత సినిమాల సక్సెస్ తో సంబంధం లేకుండా టెంపర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం జోరుగా జరుగుతోంది. మాకు అందిన లేటెస్ట్ సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమాకి సంబందించి ప్రపంచ వ్యాప్తంగా భారీ అమౌంత్స్ కి రైట్స్ అమ్ముడు పోయాయి. అలాగే శాటిలైట్ మరియు ఆడియో వీడియో రైట్స్ కి కూడా భారీగా అమౌంట్ వస్తుందని అంటున్నారు.
అన్ని ప్రాంతాల నుండి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఈ సినిమా రైట్స్ కోసం భారీ పోటీ జరిగింది. అందులో అన్ని ప్రాంతాల వారు భారీ మొత్తానికి ఈ సినిమా రైట్స్ తీసుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ వదిలిన టైం నుంచే ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాకి ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో అంచనాలను అందుకోనుంది అనే విషయాలు తెలియాలంటే ఫిబ్రవరి 13 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే..

