సొంత నిర్మాణ సంస్థలో త్రిష కొత్త సినిమా..

సొంత నిర్మాణ సంస్థలో త్రిష కొత్త సినిమా..

Published on Feb 7, 2015 1:20 PM IST

trisha

‘ఎన్నై ఆరిందాల్’ సినిమా విజయంతో సంతోషంగా ఉన్న త్రిషకు తమిళంలో మరో అవకాశం వచ్చింది. యువహీరో జై సరసన ఆమె జోడి కట్టబోతుంది. గ్రామీణ యువతి పాత్రలో కనిపిస్తుందని సమాచారం. తిరు ఈ సినిమాకు దర్శకుడు. తమన్ సంగీత దర్శకుడు. గతంలో ఈ దర్శకుడు తెరకెక్కించిన ‘సమర్’ (తెలుగులో వేటాడు వెంటాడు) సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నారు. పెళ్లి కుదిరిన తర్వాత త్రిష సంతకం చేసిన మొదటి సినిమా ఇది.

ఈ సినిమాను త్రిషకు కాబోయే భర్త వరుణ్ మణియన్ నిర్మిస్తుండడం విశేషం. సుశాంత్ ప్రసాద్ మరో నిర్మాత భాగస్వామ్యంతో సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి తర్వాత సినిమాలో నటించే విషయంలో త్రిష కాబోయే భర్త ఎటువంటి ఆంక్షలు విధించడం లేదని క్లియర్ అయ్యింది.

తాజా వార్తలు