రామ్ ‘శివం’కి ముహూర్తం కుదిరింది.!

రామ్ ‘శివం’కి ముహూర్తం కుదిరింది.!

Published on Feb 8, 2015 5:10 PM IST

ram

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం ‘పండగ చేస్కో’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చివరి దశకు చేరుకునేలోపు రామ్ మరో రెండు సినిమాలకు సైన్ చేసాడన్న సంగతి మీకు ఇది వరకే తెలియజేశాం. అందులో ఓ సినిమాని పట్టాలెక్కించడానికి కూడా రామ్ రెడీ అయిపోయాడు. ఓకే చేసిన రెండు స్క్రిప్ట్స్ లో ముందుగా శ్రీనివాస్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చేయనున్న సినిమాని మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమా రేపు ఉదయం అధికారికంగా ప్రారంభం కానుంది.

ఈ విషయాన్ని రామ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ‘నేను హీరోగా శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ లో శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో రానున్న శివం సినిమా రేపు ప్రారంభం కానుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాకి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్, పీటర్ హెయిన్స్ యాక్షన్ ఎపిసోడ్ కంపోజ్ చేస్తాడని’ రామ్ తెలియజేశాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని అంటున్నారు. రామ్ చేస్తున్న పండగ చేస్కో సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి సమ్మర్ లో సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు