డిఫరెంట్ స్క్రిప్ట్స్ పై దృష్టి పెట్టిన శర్వానంద్

డిఫరెంట్ స్క్రిప్ట్స్ పై దృష్టి పెట్టిన శర్వానంద్

Published on Feb 8, 2015 6:13 PM IST

shwaranandh

కెరీర్ ప్రారంభం నుంచి కమర్షియల్ సక్సెస్ తో సంబంధం లేకుండా వరుసగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల్లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. శర్వానంద్ కి గమ్యం, ప్రస్థానం, అందరి బంధువయ సినిమాలు మంచి పేరు తెచ్చాయి. కానీ కెరీర్లో కమర్షియల్ సక్సెస్ లు తక్కువ అందుకే ప్రస్తుతం శర్వానంద్ డిఫరెంట్ స్టొరీ లైన్ తో కమర్షియల్ స్టామినా కూడా ఉన్న సినిమాలను ఎంచుకునే పనిలో ఉన్నాడు. అందులో భాగంగానే శర్వానంద్ పూర్తి అల్లరి కుర్రాడిలా ఇప్పటి వరకూ చేయని ఓ పాత్రతో చేసిన సినిమా ‘రన్ రాజా రన్’.

ఈ సినిమా కలెక్షన్స్ పరంగా శర్వానంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత కూడా శర్వానంద్ ఓ డిఫరెంట్ లవ్ స్టొరీ అయిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యి అన్ని చోట్ల నుండి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాల విజయంతో ఇదే తరహా సినిమాలానే ఎంచుకునే ఆలోచనలో శర్వానంద్ ఉన్నట్లు సమాచారం. ఇక నుంచి తన ప్రతి సినిమాలోనూ తన సినిమాల్లో ఉండే ఒక డిఫరెంట్ స్టొరీ లైన్ తో పాటు కమర్షియల్ అంశాలు కూడా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అదే తరహాలోనే శర్వానంద్ ఇప్పటికే రెండు స్క్రిప్ట్స్ ని కూడా ఓకే చేసాడు. ఈ సినిమాల వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేయనున్నారు.

తాజా వార్తలు