డబ్బింగ్ థియేటర్లో ‘ఎవడే సుబ్రమణ్యం’..!

డబ్బింగ్ థియేటర్లో ‘ఎవడే సుబ్రమణ్యం’..!

Published on Feb 9, 2015 12:39 PM IST

Yevade-Subramanyam
యువ హీరో నాని నటించిన తాజా సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’. మలయాళ భామ మాళవిక నాయర్, రితు వర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. హీరో నాని, ఇతర ప్రధాన తారాగణం తమ పాత్రలకు డబ్బింగ్ చెప్తున్నారు. ఈ నెలలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

శేఖర్ కమ్ముల శిష్యుడు నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను స్వప్న సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ నిర్మించారు. రాకేశ్ – నవీన్ లు సినిమాటోగ్రఫీ అందించారు. మౌంట్ ఎవరెస్ట్ వద్ద బేస్ క్యాంపులో షూటింగ్ జరిపిన తొలి సినిమాగా రికార్డుకెక్కింది. ఆ సినిమాలు సినిమాకు హైలైట్ అవుతాయని చిత్ర బృందం భావిస్తుంది.

తాజా వార్తలు