
సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ శకర్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఐ’. విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై విజువల్ వండర్ అనిపించుకుంది. అంతే కాకుండా విడుదలైన 25 రోజుల్లో ఈ సినిమా ఒక సెన్సేషన్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా 25 రోజుల్లో 200 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసింది. గతంలో శంకర్ – రజినీకాంత్ ల ‘రోబో’, ఆ తర్వాత ‘ఐ’ సినిమాలు మాత్రమే సౌత్ నుంచి 200 కోట్ల మార్క్ ని టచ్ చేసాయి.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, తమిళంలో మాత్రం మంచి హిట్ అయ్యింది. శంకర్ – విక్రమ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ వలన ఈ సినిమా తమిలంలోమంచి విజయం అందుకుంది. అంతే కాకుండా తాజాగా అజిత్ ఎన్నై అరింధాల్ సినిమా రిలీజ్ అయినప్పటికీ ఐ కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. విక్రమ్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.

